రానా టాక్ షో లో రాజమౌళి..! 8 d ago
హీరో రానా హోస్ట్ చేస్తున్న "ది రానా దగ్గుబాటి షో" లో స్టార్ డైరెక్టర్ రాజమౌళి తన ప్రేమ కథని బయటపెట్టారు. తాను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో ఒక అమ్మాయి పై ఇష్టం ఉండేదని, కానీ ఆమెతో మాట్లాడాలి అంటే భయపడేవారని చెప్పారు. దీంతో తోటి విద్యార్ధులు తనను ఏడిపించే వారని తెలిపారు. ఏడాది మొత్తంలో అతికష్టం మీద ఒకేఒక్కసారి ఆమెతో "ట్యూషన్ ఫీజు కట్టావా" అని మాట్లాడినట్టు చెప్పగా రానా పగలబడి నవ్వారు.